భువనేశ్వర్ కుమార్ ఔట్, శార్దూల్ ఠాకూర్ ఇన్ – IND vs WI

IND vs WI First ODI - Chennai - Ninna Nedu

 

సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో సారి గాయం కారణంగా టీమ్ లో స్థానం కోల్పోయాడు. ప్రపంచ కప్ తర్వాత మోకాలికి గాయం అవ్వడంతో జట్టులో స్థానం కోల్పోయిన భువి తిరిగి వెస్టిండీస్ తో T20 సిరీస్ లో పునరగమనం చేసాడు. ఐతే ఆ గాయం మళ్ళీ తిరగబడిందని దాని కారణంగానే భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కి జట్టులో చోటు కల్పిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది.

గాయం ఎంత తీవ్రమైనదో ఇప్పుడే చెప్పలేమని, ప్రస్తుతం భువికి పరీక్షలు నిర్వహిస్తున్నాం అని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మీడియాకి తెలియజేసారు.

ఇటీవల టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్న ఉమేష్ యాదవ్ కు భువి స్థానంలో చోటు కల్పిస్తారని అందరూ భావించారు కానీ సెలెక్టర్లు మాత్రం శార్దూల్ ఠాకూర్ వైపే మొగుచూపారు.

 

IND vs WI First ODI - Chennai - Ninna Nedu

 

వెస్టిండీస్, భారత్ మధ్య మూడు వన్డే సిరీస్ నేడు చెన్నై వేదికగా మొదలు కాబోతుంది. హోరాహోరీగా సాగిన T20 సిరీస్ మరువక ముందే వన్డే సిరీస్ మొదలవుతుండడంతో అటు ఆటగాళ్లకు ఇటు భారత క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి.

మొన్న జరిగిన T20 సెరీస్ లో భారత కెప్టెన్ కింగ్ కోహ్లీ విశ్వరూప ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్ ని కూడా చేజిక్కుంచుకునేందుకు సనగ్ధమైంది. మరోవైపు T20 సిరీస్ చేజార్చుకున్న విండీస్ మాత్రం ఎలాగైనా వన్డే సిరీస్ గెలిచి ప్రపంచ నెంబర్ 1 భారత్ కు షాక్ ఇవ్వాలనే ఆలోచనతో బరిలోకి దిగుతోంది.

T20 లాగే వన్డే సిరీస్ కూడా అలరించాలని, అలాంటి పోటీనే ఇప్పుడుకూడా చూడాలని క్రికెట్ ప్రియులు ఉవ్విళ్లూరుతుంన్నారు. ప్రధాన పేసర్లు అయిన భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రహ్ లేకుండా బరిలోకి దిగుతున్న భారత్ ఎంత వరకు ఆకట్టుకోగలదో తేలాల్సివుంది. షమీ ఉన్నప్పటికీ వన్డేల్లో అంత భువి కి బుమ్రహ్ కి ఉన్న అనుభవంతో పోలిస్తే తక్కువే. స్పిన్నర్ల విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. మరో సారి అందరి కళ్ళు రిషబ్ పంత్ పైన ఉండడం కాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *