ఆస్ట్రేలియాను కాల్చేస్తున్న దావాలనం – అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం

FOREST FIRE IN AUSTRALIA, EMERGENCY DECLARED BY THE GOVERNMENT - NINNA NEDU

FOREST FIRE IN AUSTRALIA, EMERGENCY DECLARED BY THE GOVERNMENT - NINNA NEDU

ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ లోని బిప్లిన్ ప్రాంతాన్ని దావాలనం కాల్చేస్తుంది. న్యూ సౌత్ వేల్స్ తో పాటు, క్వీన్స్ ల్యాండ్, సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రాంతాలలో కూడా కార్చిచ్చు వ్యాపించడం అక్కడి ప్రజలను భయబ్రాంతులకి గురిచేస్తుంది. రాకాసి నిప్పు దోరికిన దన్నాళ్ల కబళించేస్తు అత్యంత క్రూరంగా మారుతుంది, ఆస్ట్రేలియాన్ అగ్నిమాపక సిబ్బంది 2000 మంది ఈ మంటలను అదుపు చెయ్యడానికి తీవ్రగా చమటోడుస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సహాయంగా ఆస్ట్రేలియాన్ డిఫెన్సె ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆస్ట్రేలియాలో ఎప్పుడు చూడనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సగటున 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సిడ్నీ నగరంలో 39 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అయింది.

గత కొన్ని నెలలుగా వస్తున్న ఈ మంటలు దాదాపు 30 లక్షల హెక్టార్లలో వ్యాపించాయి. సుమారు 900 ఇల్లు మంటల్లో తగలబడగ, ఆరుగురు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాలో వాయు కాలుష్యం తార స్థాయికి చేరుకుంది. దేశంలో చాలా ప్రదేశాల్లో విష పూరితమైన వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య భారీగా పెరిపోతుందని అధికారులు వెల్లడించారు. దాదాపు మాములు కంటే 10 – 12 శాతం ఈ సంఖ్య పెరిగిందని అంటున్నారు.

ప్రజలు అందరూ వీలైనంత వరకు చల్లటి, ఎండ తాగాలని ప్రదేశాలు ఉండాలని ఆస్ట్రేలియాన్ మెడికల్ కౌన్సిల్ హెచ్చరించింది. కానీ ప్రజలు మాత్రం తీవ్ర నిరసనలు వ్యక్త పరుస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఇంటి ముందు వెంటనే వాతావరణాన్ని అదుపులోకి తీసుకొని రావాలని నినాదాలు చేశారు. ఈ దావాలనాన్ని అదుపు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బందికి సహాయంగా అమెరికా, కెనడా దేశాలు తమ సిబ్బందిని పంపించాయి. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఏడూ రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

FOREST FIRE IN AUSTRALIA, EMERGENCY DECLARED BY THE GOVERNMENT - NINNA NEDU
FOREST FIRE IN AUSTRALIA, EMERGENCY DECLARED BY THE GOVERNMENT – NINNA NEDU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *