నేడు విడుదలైన సినిమాల రివ్యూ

Prathi Roju Pandage Telugu Movie Review - Ninna Nedu

1. ప్రతిరోజు పండగే
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు ఆరవింద్ సమర్పణలో సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాసి కన్నా హీరోయిన్ గా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమా ప్రతిరోజు పండగే. ఊపిరితిత్తుల కాన్సర్ తో మరి కొన్ని రోజుల్లో చనిపోతాడు అని తెలిసిన తాతయ్యను ఆనందంగా ఉంచడం కోసం మనుమడు ఎం చేసాడు అనేదే సినిమా కథ. ఈ కథకు టిక్ టాక్ తో ఎప్పుడు బిజీగా ఉండే హీరోయిన్ కామెడీ అడ్వాంటేజ్ ఇతే, వీరి ఇద్దరి మధ్య ప్రేమకి తావిస్తూ మారుతి క్రియేట్ చేసిన కథ కథనాలను ప్రేక్షకులకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వక తప్పదు. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు ప్రదర్శన అవగా భిన్న అభిప్రాయం వెలువడుతుంది. మొదటి భాగం కామెడీతో అద్భుతంగా ఉందని టాక్ వస్తే, రెండో భాగం సెంటిమెంట్ ని వర్కౌట్ చెయ్యడంలో మారుతి ఇంకాస్త శ్రద్ద తులీసుకొని ఉండాల్సిందిగా ప్రేక్షకులు భావిస్తున్నారు. తాత పాత్రలో మన కట్టప్ప సత్య రాజ్ జీవించేశారు. రావు రామేష్, మురళి శర్మ, నరేష్, సత్యం రాజేష్, విజయ కుమార్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర దారులు. మొత్తానికి సినిమా మొదటి రోజు మంచి టాక్ సంపాదించుకుంది. ఫ్యామిలీ అంత కలిసి హ్యాపీగా నవుకోదగ్గ సినిమా.

Karthi's Dhonga Telugu Movie Review - Ninna Nedu

2. దొంగ
కార్తీ హీరోగా, జ్యోతిక, సత్యరాజ్, నిఖిల, షావుకారు జానకి, సీత ప్రముఖ పాత్రల్లో ఈరోజు మన ముందుకి వస్తున్న తమిళ్ డబ్బింగ్ సినిమా దొంగ. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో, హర్షిత మూవీస్ పతాకంపై ఈ సినిమా తెలుగులో నేడు విడుదైలంది. చిన్నప్పుడే తప్పిపోయి తిరిగివచ్చిన తమ్ముడు అసలు నిజంగా తన తమ్ముడేన అనే అనుమానంతో కార్తిని దూరంగా ఉంచిన జ్యోతిక, ఒకానొక సంఘటన ద్వారా కార్తిని తమ్ముడు అని ఎలా అంగీకరించిందో. ఆ అక్క కోసం తమ్ముడు ఎం చేసాడు అనేదే చిత్ర ప్రధాన విషయం. ఇటీవల విడుదలైన ఖైదీ సినిమా మంచి హిట్టు టాక్ తెచ్చుకొని ప్రేక్షకులకు అభినందనలు అందుకున్న విషయం మనకు తెలిసిందే, ఆ చిత్రం కార్తీకి ఉన్న క్రేజ్ ని మరింత రెట్టింపు చేసింది. దొంగ సినిమా మీద భారీగా అంచనాలను పెంచేసింది. ఫ్యామిలీ సెంటిమెంట్ తో థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం కాస్త నెమ్మదిగా అనిపించినా, రెండో భాగంలో ట్విస్టులతో ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తుంది. మొత్తానికి కార్తీకి మరో హిట్టు సినిమా వచ్చిందంటూ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Ruler Telugu Movie Review - Ninna Nedu

3. రూలర్
సీ.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి కే.యస్. రవికుమార్ దర్శకుడు. నందమూరి బాలకృష్ణ హీరోగా, సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా రూలర్. ఈ సినిమాలోని బాలయ్య మొదటి లుక్కు విడుదల చేసినప్పటి నుండి సామాజిక మాధ్యమాలలో బాలయ్య అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసారు. బాలయ్య మార్వెల్ స్టూడియోస్ సూపర్ హీరో అయిన ఐరన్ మాన్, టోనీ స్టార్క్ స్టైల్ లో దర్శనమివ్వడం అందరి దృష్టిని ఈ సినిమా వైపు లాగింది. ఈ వయసులో కూడా బాలయ్య కోతధానంతో ప్రేక్షకుల ముందుకు రావడం అభినందనీయం. B , C సెంటర్లకు పండగే, ఫుల్ టూ యాక్షన్ మూవీ అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు. బాలయ్య అభిమానులకు క్రిస్టమస్, న్యూ ఇయర్ ముందుగానే వచ్చినట్టు తెలుస్తుంది. మొదటి రోజే బాలయ్య చిత్రం బ్లాక్బస్టర్ టాక్ ని సంపాదించుకుంది. సినిమా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదని, బాలయ్య డాన్స్ ఇరగదీసాడని, పడతాడు సాంగ్ లో ఐతే కుమ్మేసాడని చెప్తున్నారు ప్రేక్షకులు. సినిమా చూసిన అభిమానులు మాత్రం ఇప్పటి వరకు బాలయ్యను ఇలా చూడలేదని సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తంగా మంచి టాక్ అందుకొని రూలర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది.

Dabaang 3 Hindi Movie Review - Ninna nedu

4. దబాంగ్ 3
బాలీవుడ్ కండల వీరుడు, చుల్ బుల్ పాండేగా ప్రేక్షకులను నేడు పలకరించాడు. దబాంగ్ సిరీస్ లో ఇది మూడో సినిమా. మన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సోనాక్షి సిన్హా, సోహైల్ ఖాన్ ముఖ్య పాత్ర దారులు. కొంత మంది ప్రేక్షకులు సినిమా పక్క మాస్ ఎంటర్టైనర్ అని చెప్తూ సల్మాన్ ఖాన్ ఫాన్స్ కి పండగే అంటూ రివ్యూ చెప్తుంటే.. కొత్తగా ఏమి లేదని అదే పాత కథను మళ్ళీ తీశారని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచకపోవచ్చని చెబుతున్నారు. కానీ సల్మాన్ ఖాన్ ఫాన్స్ కి మాత్రం పిచ్చిపిచ్చిగా నచ్చుతుందని అంటున్నారు. మొత్తానికి సల్మాన్ ఖాన్ ఫాన్స్ ని నిరాశపరచలేదనమాట. ఓవర్ అల్ గా ఆవేరేజ్ టాక్ తో వసూళ్లు రాబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *