సాఫ్ట్ వెర్ సుధీర్ సినిమా రివ్యూ

సాఫ్ట్ వెర్ సుధీర్ సినిమా రివ్యూ SOFTWARE SUDHEER TELUGU MOVIE REVIEW - NINNA NEDU

మేజిషియన్ గా కెరీర్ మొదలు పెట్టి నానా కష్టాలు పడుతూ, ఒక్కో మెట్టు ఎక్కుకుంటు కమిడియన్ గా, యాంకర్ గా, టీమ్ లీడర్ గా, దొరికిన ఛాన్స్ ని దొరికినట్టు వాడుకుంటూ మనల్ని ఎంతగానో అలరించిన సుధీర్ అలియాస్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా తనని తాను నిరూపించుకున్నాడు.

సుడిగాలి సుధీర్ హీరోగా, ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా, షయాజి షిండే, నాజర్, ఇంద్రజ, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకి వంచింది.
చందు అనే ఒక సామాన్య సాఫ్ట్ వేర్ ఉద్యోగి, అదే ఆఫీసులో పనిచేస్తున్న స్వాతి అనే అమ్మయి ప్రేమలో పడతాడు. ఇంట్లో వాళ్ళ అంగీకారాన్ని పొంది నిశ్చితార్థం కూడా చేసుకుంటారు. కానీ అదే సమయంలో ఇరువురి తల్లులకు చిన్నచిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకైనా మంచిదని జాతకం చూపిద్దాం అని ఒక ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ 30 రోజుల్లో చందు చనిపోతాడాని చెప్పడంతో చందుకి ఇదంతా ఆ స్వామిజీ డబ్బు కోసం నాటకం ఆడుతున్నాడని అనుకుంటాడు. కానీ ఆ స్వామిజీ ఒక పుస్తకం ఇచ్జి దీన్లో ఎం రాసి ఉంటాదో అదే నీ జీవితంలో జరుగుతుందని చెప్తాడు, 29 రోజులు బుక్కులో ఉన్నట్టే జరగడంతో చందు ఆ స్వామిజిని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడతది. మరి స్వామిజీ చందుకి కాపాడడా, ఈ కథలోకి రైతులు ఎలా వచ్చారు, అసలు స్వాతి చందు ఎం చేశారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మొత్తానికి సుధీర్ కోసం సినిమా చూడచ్చు అనే స్థాయికి వచ్చేసారు ప్రేక్షకులు, కథ బావునప్పటికి డైరెక్టర్ సరిగా తియ్యలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సినిమా ఫ్లో ని కట్ చేస్తూ మధ్యలో వచ్చే పేలవ కామెడీ సినిమాకి మైనస్ అని ప్రేక్షకుల అభిప్రాయం. మిగిలిన నటీనటులు అంత తమ తమ పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పుకోవచ్చు. అసలు సుధీర్ బలమే కామెడీ కానీ సినిమాలో హీరోయిజం మీద పెట్టిన శ్రద్ద కామెడీ మీద కిడా కాస్త పెట్టి ఉంటే బావుండేదని అంటున్నారు వీక్షకులు.

సుధీర్ ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వకుండా కడుపుబ్బా నవ్వించి ఇంటికి పంపిస్తాడనుకుంటే అలా జరగలేదు సరి కదా కనీసం ఉన్న కామెడీ కూడా సరిగా చూపించలేకపోయాదని డైరెక్టర్ మాట వింటూ పోయాడని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. డాన్స్ మాత్రం ఇరగదీసాడని, ఫైట్స్, హీరోయిజాన్ని బాగా క్యారి చేసాడని మెచ్చుకుంటున్నారు. సినిమా చూడచ్చ అంటే ఒక సారి చూడచ్చు ఆవేరేజ్ మూవీ అని అంటున్నారు.

అదండి సంగతి, సుడిగాలి సుధీర్ హీరోగా పరిచయమైన మొదటి సినిమా ఆవేరేజ్ టాక్ తో మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. కేవలం సుధీర్ కి ఉన్న బుల్లితెర క్రేజ్ ని వాడుకొని సినిమా తీశారు, అలా కాకుండా ఇంకొంచెం శ్రద్ద పెట్టి కామెడీ మరియు కధనంపైన జాగ్రత్తలు తీసుకొని ఉంటే పబ్లిక్ టాక్ మరోలా ఉండేదని నా అభిప్రాయం. మీలో ఇంకా ఎవరైనా సినిమా చూడకపోతే కచ్చితం వెళ్ళండి సినిమాని సినిమాల ఎంజాయ్ చేసే వాళ్ళకి తప్పక నచ్చుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *