కుంభరాశి జనవరి – రాశి ఫలాలు

KUMBHA RASHI JANUARY 2020 RASHI PHALALU - NINNA NEDU

కుంభరాశి వారు జనవరి 5, 21, 26 తేదీలలో బ్యాంకు మరియు ఇతర ఆర్థికపరమయిన లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. మూడవ శనివారం మరియు నాలుగవ శనివారం బంధువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల 15, 16, 17 వ తేదీలలో మీకు ప్రతికూలం ఎక్కువగా ఉందని గ్రహించి అన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి.

చేనేత వృత్తి వారికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఈ నెలలో ప్రయాణాలు అనుకూలిస్తాయి. హామీలు ఇవ్వడం వల్ల గౌరవాన్ని పొందుతారు. ఒప్పందాలు చేసుకోడం వల్ల ఆర్ధికంగా లాభాలు ఉంటాయి, అలాగే రుణ బాధలు తగ్గే అవకాశం కూడా ఉంది. సంతాన చిక్కులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. అన్ని కార్యక్రమంలో విజయ ప్రాప్తి లభిస్తుంది.

ఈ నెల 24వ తేదీ నుండి ఏలినాటి శని ప్రధమ భాగం ప్రారంభమవుతింది. అదోళచింతనకు పోకుండా జోతిష్యుడిని సంప్రదించి వ్యక్తిగత జాతకం చెప్పించుకోవడం సూచనీయం.

కుంభ రాశి వారు చెయ్యవలసిన పని: రక్ష యంత్రాన్ని దెగ్గర పెట్టుకోవడంతో పాటు, పశుపక్షాదులకు త్రాగునీరు పెట్టడం ద్వారా శుభం కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *