సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమా రివ్యూ

Darbar Movie Review - NInna Nedu

ఆల్ ఇండియా సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ హీరోగా, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా, నివేదా థామస్, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు తదితరులు ప్రధాన తారాగణంగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దర్బార్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి/పొంగల్ సినిమా సంబరాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రారంభించారు. రజినీకాంత్ సినిమాకి కేవలం తమిళనాడులొనే కాకుండా తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తుంటారు. ఆ మాటకొస్తే యావత్ భారత దేశమే ఎదురు చూస్తుంటాది. పైగా రజినీకాంత్ దర్బార్ చిత్రంలో పోలీసు కారెక్టర్ లో కనిపించనుండడంతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించింది.

అసలు కథలోకి వెళ్తే రజినీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఆదిత్య అరుణాచలం పాత్రలో కనిపిస్తాడు. నేరస్థులు ఎవరైనా సరే లెక్కచేయకుండా ప్రమాదానికి ఎదురెళ్లి మరి అంతం చేస్తుంటాడు. కానీ ఆదిత్య అరుణాచాలానికి అసలు చిక్కు మాధకద్రవ్యాలు, విమెన్ ట్రాఫికింగ్ కేసుల్లో ఎదురవుతుంది. ఆ కేసులో ఎదురైన సంఘటనల వల్ల తన ప్రాణమైన కూతురు వల్లి (నివేదా) ని కోల్పోయిన ఆదిత్య అరుణాచలం జీవితంలోకి లిల్లీ (నయనతార) ఎలా వచ్చింది. విదేశాలలు ఉంటూ ఇక్కడ అంత నడిపించే విలన్ హరి చోప్రా (సునీల్ శెట్టి) ని భారత్ ఎలా రప్పించాడు? ఎలా మట్టుపెట్టాడు అని విషయాలు తెరపైన చూడాలి.

కథ పాతదే అయినప్పటికీ వినూత్నమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలాగా సినిమాని తీర్చి దిద్దారు దర్శకుడు మురుగదాస్. విమెన్ ట్రాఫికింగ్ ముఠాని బయటకు రప్పించి సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారు. ప్రధామర్ధం ఆకట్టుకున్న ద్వితీయార్థంలో కాస్త పట్టు కోల్పోయినట్టుగా అనిపించినప్పటికి రజినీకాంత్ స్టైల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు.

మొత్తానికి సినిమాలో ఆదిత్య అరుణాచలం బాడ్ పోలీసుగా అందరిని ఆకర్షించారు. మొదటి రోజు కలెక్షన్స్ 30 కోట్లు వచ్చాయని సమాచారం. ఓవర్సీస్ లో కూడా భారీగా ఓపెనింగ్స్ వచ్చాయని సమాచారం. మొత్తానికి రజిని అభిమానులతో పాటు సినిమా అభిమానులకు కూడా రజిని సంక్రాంతి కనుక అదిరిందనే చెప్పాలి.

ఈ చిత్రానికి అనిరుద్ రవి చంద్రన్ సంగీతం సమకూర్చగా. ఎన్వీ ప్రసాద్ సమర్పణలో లైకా ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *