మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ 3.5/5

Sarileru Nekevvaru Movie Review - Ninna Nedu

బారి అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈరోజు రిలీస్ అయిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్టు టాక్ సంపాదించుకుంది. చాలా కాలం తర్వాత మహేష్ బాబుని ఫుల్ టైం మాస్ క్యారెక్టర్ లో చూసిన ప్రేక్షకుల ఆనందానికి హద్దులు లేవు. తెలుగు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడ రాజీ పడకుండా అద్భుతంగా తెరకెకించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో రష్మీక మందన హీరోయిన్. సంగీత, హరి తేజ, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, అజయ్ ప్రధాన పాత్రధారులు.

ఇప్పటికే ప్రేక్షకులు బొమ్మ సూపర్ హిట్టు అని తమ తమ సామాజిక మధ్యమ అకౌంట్లలో స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి మొన్న దర్బార్ ఈరోజు సరిలేరు నీకెవ్వరు సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొంది మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాయి. మహేష్ బాబు అభిమానులైతే మహేష్ పోకిరిని మించిపోయిందని బ్లాక్ బస్టర్ సినిమా అని ఆకాశమే హద్దుగా తమ ఆనందాన్ని వ్యక్తపరిస్తున్నారు.

దేవి ఇచ్చిన సంగీతం సినిమాకి అతి పెద్ద ప్లస్ అని అందరూ చెప్తున్నారు. మహేష్ బాబు సొంత బ్యానర్ అయిన జీయంబి ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో ఈ చిత్రం విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి, శ్రీమని ఈ సినిమాలో చెరో రెండు పాటలు రాసారు.

మొత్తానికి సినిమా అభిమానులకు సంక్రాంతి రెండు రోజుల ముందే వచ్చిందని చెప్పాలి.
అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అల వైకుంటాపురంలో రేపు ప్రేక్షకుల ముందుకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *