తెలంగాణ ఊటీ – అనంతగిరి పర్వతాల అందాలు – నిన్న నేడు ట్రావెల్ స్టోరీ

 

Kotipally Dam - Ananthagiri Hills - Vikarabad
Kotipally Dam – Ananthagiri Hills – Vikarabad

హైదరాబాద్ నుండి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఊటీ లాంటి ప్రదేశం ఉందంటే ఇక రాజధాని వాసులకు పండగే కదా. చక్కని ప్రకృతి సోయగాలు, ఆహ్లాదాన్నిచ్చే రమణీయ పరిసరాలు. వాగులు, కొండలు, సరస్సులు, దేవాలయాలు, ఇలా చెప్పుకుంటుంటే సమయం సరిపోదు. హైదరాబాద్ నగరంలోనుంది ప్రయాణించి నల్లగొండ జిల్లాలో కృష్ణ నదిలో విలీనమయ్యే మూసి నదికి జన్మస్థానం కూడా ఇదే. ఒక చిన్న గుండంలో పుట్టి నగరానికి ఎంతో కాలం త్రాగునీరు అందించి ఇప్పుడు పట్టించుకోకపోవడంతో మురికి నీరు చేరి మహా నగర అతి పెద్ద మురికి నీటి నాలగా మారిపోయింది. ఇప్పటి జనరేషన్ కి మూసి అంటే ఒక మురికి కాలువ కానీ 100 ఏళ్ల క్రితం నగర ప్రజలు దేన్ని మీద ఆధారపడి జీవనాన్ని సాగించేవారు. ఇప్పటికి కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ (గండిపేట) చెరువులోకి వచ్చే నీరు ఈ నదిలోనివే. భాగ్యనగర ప్రజల భాగ్య రేఖకు జన్మస్థానాన్ని చూసొద్దామ మరి. అయితే వికారాబాద్ దరిదాపుల్లోకి వెళ్లాల్సిందే ఎందుకంటే అక్కడే నెలవయ్యాయి ఈ అద్భుతమైన అడవులు.

Kotipally Dam - Ananthagiri Hills - Vikarabad
Kotipally Dam – Ananthagiri Hills – Vikarabad

హైదరాబాద్ నుండి బస్సు, రైల్ మార్గాలు ఉన్నాయి. నిరంతరం ఆర్టీసీ బస్సులు సేవలను అందిస్తూనే ఉంటాయి. సొంతగా వెళ్లాలనుకునే వారు కారులోనే బండిపైనో చాలా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం సొంత వాహనాల్లో వెళ్లాడమే ఉంత్తమం ఎందుకంటే అక్కడ ప్రకృతి సోయగాన్ని ఆనందించడంలో మీరు ఎక్కువ అలసిపోకుండా ఉండేందుకు మరిన్ని కాసులు ఖర్చు కాకుండా ఉండేందుకు ఇది లాభదాయకం.

Ananthagiri Hills - Vikarabad
Ananthagiri Hills – Vikarabad

హైదరాబాద్ మెహదీపట్నం నుండి లేదా గచ్చిబౌలి నుండి బయలుదేరి, చిలుకూరు మీదుగా మొయినబాద్, చేవెళ్ల, మన్నెగూడా దాటుకుంటూ వికారాబాద్ చేరుకోవచ్చు అక్కడి నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైన ప్రకృతి ఒడికి చేరుకోవచ్చు. లేదా పఠాన్ చేరు మీదుగా వెళ్లాలనుకునే వాళ్ళు శంకరపల్లి, నవాబుపేట మీదుగా చేరుకోవచ్చు. ముందుగా 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన అనంత పద్మనాభుని దేవాలయం అందరిని ఆకర్షించడంతో పాటు పరిసరాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అనంత పద్మనాభుని ఆశీర్వాదం లభించగానే. 3760 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అనంతగిరి సోయగాలను వీక్షించడానికి సిద్ధం అవ్వండి.

ఎటు చూసిన పచ్చని చెట్లు చల్లని వాతావరణం పిల్లలనుండి పెద్దల వరకు అందరిని ఆనందంలో ముంచి తేల్చుతుంది. సరదాగా ఒక రోజు మొత్తం కుటుంబంతో సంతోషంగా గడపాలనుకునే వాళ్ళు, స్నేహితులతో కలిసి సమయం వెచ్చించాలనుకునే వాళ్ళు, ప్రకృతి ప్రేమికులు, రొటీన్ కి భిన్నంగా ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళకి అనంతగిరి పర్వతాలు మంచి అనుభూతులను మిగల్చడం కాయం. ఇచ్ఛ ఉన్న వాళ్ళు ఇక్కడ ట్రెక్కింగ్ చేసే సౌలభ్యం కూడా ఉంది.

రాత్రి పూత క్యాంప్ ఫైర్ వేసుకొని రాత్రి వేళా ఈ అటవీ అందాల రామనీయతను చూద్దాం అనుకునే వాళ్లకు వికారాబాద్ అటవీ శాఖ గూడరాలను ఏర్పాటు చేసింది. ఎంచక్కా సమయం ఉన్నప్పుడు ఈ టెన్షన్ లైఫ్ నుండి దూరంగా, ఇటువంటి ప్రదేశానికి వచ్చి రెండు రోజులు గడిపితే జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

bugga rama lingeshwara swamy temple - Ananthagiri Hills - Vikarabad
bugga rama lingeshwara swamy temple – Ananthagiri Hills – Vikarabad

అతి ప్రాచినమయిన దేవాలయాలు ఎన్నో ఈ అడవుల్లో ఉన్నాయి వాటిలో బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం చెపౌకోదగ్గది ఇక్కడ భూమి నుండి గంగ బుడగ రూపంలో బయటకి రావడం వల్ల శివుడిని బుగ్గ రామలింగేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తారు. ఇక్కడి కొనేరులో నిత్యం జలం ప్రవహించడం విశేషమని చెప్పాలి ఎందుకంటే ఆ జలం ఎక్కడినుండి వస్తుందో ఇప్పటికి అంతుచిక్కని రహస్యమే. శ్రావణ మాసం, కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముందు చెప్పుకున్న పద్మనాభ స్వామి దేవాలయంలో కార్తీక మాసంలో 15 రోజులు పెద్ద జాతర, శ్రావణ మాసంలో 3 రోజులు చిన్న జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

Ananthagiri Hills - Vikarabad Trekking spot
Ananthagiri Hills – Vikarabad Trekking spot

జలాశయాలంటే మక్కువ ఉన్నవారు కూడా అనంతగిరి పర్వతాలను సందర్శించవచ్చు. అనంతగిరికి దెగ్గరలో ఉన్న కోటిపల్లి డమ్ పర్యాటకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ బోటింగ్ చేసే ఏర్పాటు కూడా ఉంది. అంతే కాకుండా పర్యాటకుల సౌకర్యార్థం బాత్రూములు, తెచ్చుకున్న పదార్ధాలను తినడానికి వీలుగా ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు.

Anantha Padmanabha swamy temple - Ananthagiri Hills - Vikarabad
Anantha Padmanabha swamy temple – Ananthagiri Hills – Vikarabad

అంతేనా అనుకుంటున్నారా కాదండి మరో ముఖ్యమైన విషయం కూడా మీతో పంచుకోవాలి. ఇటీవల ఈ అనంతగిరి పర్వతాలు స్కై డైవింగ్ కి అనుకూలంగా ఉన్నాయని కేంద్ర పర్యాటక శాఖ ప్రతినిధులు తేల్చారు. అది అన్ని టెస్టులు పూర్తి చేసుకుని మొదలవుతే అడ్వెంచర్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇక పండగే.

మొత్తానికి వికారాబాద్ జిల్లా కేంద్రానికి అనుకోని ఉన్న అనంతగిరి అందాల గురించి తెలుసుకున్నాం మరి ఇక లేట్ ఎందుకు వెంటనే వెళ్లి చూసేయండి.

Ananthagiri Hills - Vikarabad
Ananthagiri Hills – Vikarabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *