హైదరాబాద్ దెగ్గరలో అద్భుత కోట -భువనగిరి – నిన్న నేడు ట్రావెల్ స్టోరీ

Bhuvanagiri Fort - NInna nedu Travel
Bhuvanagiri Fort – NInna nedu Travel

ఆంధ్రప్రదేశ్ రాష్టం 2014లో రెండుగా విడిపోయాక తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ఎక్కడ ఏ మంచి ప్రదేశం ఉన్న దాన్ని డెవెలప్ చేసునందుకు సాధ్యమైనంతగా కృషి చేస్తుంది. అలాంటిది హైదరాబాద్ కి అతి చేరువలో ఉన్న ప్రదేశాలను ఎలా విస్మరిస్తుంది చెప్పండి. అందుకే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కి చేరువలో ఉండే ప్రాచీన కట్టడాలను, దేవాలయాలను, ప్రకృతి సౌందర్యాలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందనే చెప్పాలి. చెయ్యడమే కాదు వాటిలో సఫలం కూడా అయిందనే చెప్పాలి. ఇదివారకటితో పోల్చుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెరిగిందనే అధికారులు కూడా వెల్లడిస్తున్నారు.

ఇక ఈరోజు నిన్న నేడు ట్రావెల్ స్టోరీలో మనం తెలుసుకునే ప్రదేశం హైదరాబాద్ నగరానికి కేవలం 47 కిలోమీటర్ల దూరంలో, యాదగిరిగుట్ట వెళ్లే మార్గంలో, అత్యంత ప్రాచినత, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భువనగిరి కోట. సముద్రమట్టానికి దాదాపు 609 మీటర్ల ఎత్తు ఉన్న ఏకశిలా కొండ పైన అద్భుతంగా నిర్మింపబడ్డ భువునగిరి దుర్గం షుమారు 3000 ఏళ్ల క్రితం నిర్మించినదని చరిత్ర చెబుతుంది. ఈ కొండ తెలంగాణ లోని అనంతగిరి, ఉర్లుకొండ, ఉండ్రుకొండ కంటే ఎత్తాయినది. భువనగిరి కోట ఏ కొండ పైన అయితే నిర్మించారో ఆ కొండకు ఒక ప్రత్యేకత ఉంది ఈ కొండ ఒక వైపునుంది చూస్తే తాబేలు లాగా మరో వైపు నుండి చూస్తే పడుకున్న ఏనుగు మల్లె కనిపిస్తుంది. భువునగిరి కోటను పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన 6వ త్రిభువన మళ్లా విక్రమాదిత్యుడి నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. అందుకే ఈ నగరానికి భువనగిరి అనే పెరు సంతరించిందని చెబుతారు. ఈ నగరం కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

Bhuvanagiri Fort - NInna nedu Travel
Bhuvanagiri Fort – NInna nedu Travel

ఈ కొండ పైకి వెళ్ళడానికి నైరుతి మరియు ఆగ్నేయంలో రెండు మార్గాలు ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు కేవలం ఒక మార్గం మాత్రమే ఉపయోగిస్తున్నారు. కోటలో గుర్రాల శాలలు, ఏనుగు శాలలు, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, నల్లని నంది విగ్రహం, రాజా మందిరాలు, రాణివాసాలు, జల కొలనులు, బావులు, ఇంకా మరెన్నో ఆకట్టుకునే కట్టడాలు ఉన్నాయి. కోటలో రాజప్రాసాదాల కింద ఎన్నో అంతుచిక్కని రహస్య మార్గాలు, గుహలు ఉన్నాయి. కాలక్రమేణా కొన్ని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకొని లోయలో పడిపోయి ఉండడం మనకు కనపడతాయి. హైదరాబాద్ లో ఉంటూ చరిత్ర అంటే మక్కువ ఉన్న వారు సరదాగా ఒక ఆదివారం వెచ్చించి ఈ కోట చరిత్ర గురించి భువనగిరి నగరం గురించి తెలుసుకోవచ్చు.

Bhuvanagiri Fort - NInna nedu Travel
Bhuvanagiri Fort – NInna nedu Travel

భువనగిరిలో లభ్యమైన కొన్ని శాసనాల ఆధారంగా 1163 వరకు కల్యాణి చాళుక్యులు ఆ పిమ్మట 1323 వరకు కాకతీయుల సమంత రాజధానిగా వర్ధిల్లిందని తెలుస్తోంది. అనంతరం కొన్ని దశాబ్దాల కాలం పాటు వివిధ రాజ్యాల ఆధీనంలో ఈ కోట ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలనలో, 16వ శతాబ్దంలో సీతాపతి భానుడి పాలనలో, 16, 17వ శతాబ్దాలలో కుతుబ్షాహిల అధికారంలో, 18వ శతాబ్దం ఆరంభంలో సర్వాయి పాపన్న ఆధ్వర్యంలో ఉన్న భువునగిరి కోట ఆ తర్వాత స్వాతంత్రం వచ్చే వరకు నిజాముల పరిపాలనలో కొనసాగింది. ఎన్నో ఏళ్ళు భువనగిరి కోట తెలుగు రాజుల సైన్య క్షత్రంగా వెలుగొందినట్టు స్పష్టమవుతుంది.

ఖిల్లా పైకి ఎక్కుతుంటే మెట్లకు సమాంతరంగా ఏడూ బావులు కనపడతాయి వీటిని ఎదుకన్యాల బావులని పిలుస్తారు. ఒక్కో బావి సుమారు 60 నుండి 100 అడుగుల లోతు ఉంటాయి. ఖిల్లా దక్షిణ బాగానే చివరకు రెండు నీటి గుండాలు ఉంటాయి ఇవి విశాలంగా మరింత లోతుగా ఉంటాయి. వీటిలోనుంది నీటిని ఏనుగుల ద్వారా వెలికి తీసేవారట అందుకే ఈ గుండాలను ఏనుగుల బావి అని పిలుస్తారు. కోట నిర్మాణం, కోట గోడలపైన చెక్కబడిన ఏనుగులు, గుర్రాల చిత్రాలు, గుండాలు, ద్వారాలు, తక్కిన నిర్మాణాలు ఆనాటి శిల్పకళా నైపుణ్యాన్ని తెలిపేందుకు దోహద పడతాయు.

Bhuvanagiri Fort - NInna nedu Travel
Bhuvanagiri Fort – NInna nedu Travel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *