రవితేజ డిస్కో రాజా మూవీ రివ్యూ 3/5

Raviteja Disco Raja Movie Review - NInna nedu

ఎంతో కాలంగా సరైన హిట్టు లేక కెరీర్ పరంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్న మాస్ రాజా రవితేజకి డిస్కో రాజా సినిమా కాస్త ఊరట ఇచ్చిందనే చెప్పాలి. పాయల్ రాజపుట్, నభ నటెశ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా 25 ఏళ్ల ముందు జరిగే కథగా ఈ సినిమాని వి ఐ ఆనంద్ సైన్స్ ఫిక్షన్ ను జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. వెన్నెల కిషోర్, సునీల్, రవితేజ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వకుండా చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో మంచి ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరో సారి తానేంటో నిరూపించుకున్నాడు. అదిరిపోయే బాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఆకట్టుకునే పాటలు అందించి వీక్షకులకు శ్రవనానందం కలిగించారు.

Raviteja Disco Raja Movie Review - NInna nedu

ఇక కథ పరంగా చూసుకుంటే కొంత మంది మొదటి భాగం బావుందంటే మరి కొందరు రెండో భాగం బావుందని అంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు చెప్పేది మాత్రం, రవితేజ కామెడీ టైమింగ్, ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాల గురించే. మాస్ మహారాజ ఇస్ బాక్ అని సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇక మాస్ మహారాజా రవితేజ అభిమానులకైతే పండగ వాతావరణం అనే చెప్పాలి. గత కొంత కాలంగా రవితేజ బాక్స్ ఆఫీసు దెగ్గర తనేనెటో నిరూపించుకోలేకపోడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇప్పుడు డిస్కో రాజా తో ఆ లోటు తీరిపోయిందని, రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ ఒక మాంచి హిట్టు కొట్టదని ఆనందంలో మునిగిపోతున్నారు.

మొత్తానికి రవితేజ ఫ్లోప్స్ కి బ్రేక్ పడ్డట్టే అని విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నారు. సినిమా బావుందని ఓవర్ అల్ టాక్. మరి దెగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్లిపోదాం పదండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *