తెలుగుభాష దినోత్సవం సందర్భంగా మోడీ తెలుగు ట్వీట్

Narendra Modi Telugu Tweet on Telugu Language Day

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన స్వయంగా తెలుగులోనే ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి సేవ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి ఈ రోజు నేను నివాళులు అర్పిస్తున్నాను.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గిడుగు వేంకట రామమూర్తి పంతులు జయంతి, తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని “మనభాష-మన సమాజం-మన సంస్కృతి” అంతర్జాల సదస్సు నిర్వహణ అభినందనీయం. ఇందు కోసం చొరవ తీసుకున్న దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య, ప్రపంచం నలుమూలల నుంచి హాజరైన ఇతర సంస్థలకు అభినందనలు. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ గిడుగు వారు, విజ్ఞానం అందరికీ అందాలనే సంకల్పంతో వ్యవహారిక భాషోద్యమానికి నాంది పలికారు. పుస్తకాల్లోనూ సులభమైన భాషను వాడాలని ఉద్యమించారు. తద్వారా తెలుగు భాష అభివృద్ధిని ఆకాంక్షించారు. మాతృభాషను కాపాడుకోవడమే వారికిచ్చే నిజమైన నివాళి.’’ అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ట్వీట్ చేశారు. ‘‘గ్రాంధికాన్ని సరళీకరించి వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని, పలకడంలో ఉండే సౌఖ్యాన్ని తెలియజెప్పిన భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి గారు. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టిని వచన భాషతో సామాన్యుల చేతికందించిన గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగుని సన్మానించుకోవడమే.’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

Venkayya Naidu Tweet on Telugu Language Day

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *