జెనసైనికులకు నివాళి అర్పించిన భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy On Janasena warriors death

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురష్కరించుకుని ఆయన భారీ కటౌట్‌ను ఏర్పాటుచేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతిచెందిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుప్పం-పలమనేరు రహదారి పక్కన 30 అడుగులు కటౌట్‌ను ఏర్పాటుచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యారు. మొత్తం 10 మంది విద్యుదాఘాతానికి గురి కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్‌, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం విద్యుత్‌ షాక్‌‌తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తపరిచారు. శాంతిపురం దగ్గర కటౌట్‌ కడుతుంటే విద్యుత్‌ షాక్‌ తగలడంతో వారు చనిపోయారనే వార్త తన మనసుని కలచివేసిందని, ఇది మాటలకు అందని విషాదమని. ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలనని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానట్టు తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరో ముగ్గురు జన సైనికులు శ్రీ హరికృష్ణ, శ్రీ పవన్‌, శ్రీ సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారు అని, వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానట్టు తెలిపారు.

ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. చనిపోయిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా పోలీసులు గుర్తించారు. వీరంతా శాంతిపురం మండలం కడపల్లి గ్రామానికి చెందినవారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఈ మేరకు జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతికి లోనౌతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘గుండెల నిండా నా పట్ల అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్‌, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం విద్యుత్‌ షాక్‌‌తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.. కొడుకుల్ని పోగొట్టుకున్న ఆ కుటుంబాలకు నేనే ఒక బిడ్డగా ఉంటానని.. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేస్తూ మరణించిన వారి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ప్రకటించారు.

ఇక పవన్ నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” చిత్ర యూనిట్ కూడా ఈ విషాద ఘటనపై స్పందిస్తూ.. మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *