సాయనికి మరో నిర్వచనం చెబుతున్న – 2004 హెల్పింగ్ హార్ట్స్

2004 Helping Hearts Donates 20 Thousand

పశ్చిమ గోదావరి జిల్లా, టి నరసాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామానికి చెందిన 2004 సంవత్సరానికి చెందిన పదవ తరగతి విద్యార్థులు నలుగురికి ఉపయోగ పడాలి అనే ఉద్దేశంతో, హెల్పింగ్ హార్ట్స్ అనే పేరుతో, ఒక సంస్థను ఏర్పాటు చేశారు.

హెల్పింగ్ హార్ట్స్ అనేది ఎవరికి అయినా ఎడ్యుకేషన్, హెల్త్, ఫైనాన్సిల్ గా బాగా వెనకబడిన వాళ్ళకి హెల్ప్ చెయ్యడానికి స్థాపించినట్టు వారు తెలిపారు. మనస్ఫూర్తిగా సహాయం చేసే ఒక రూపాయి కూడా ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది అని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఉన్నంతలో కొంచెం హెల్ప్ చేస్తే ఆ డబ్బులు ఎవ్వరో ఒకరికి ఉపయోగ పడతాయని అంత ఇంత అని కాదు తొచినంత, ఎంతయిన సాయం సాయమే కదా అని అంటున్నారు ఈ సంస్థ సభ్యులు.

*ప్రార్థించే పెదవులు కన్న సహాయం చేసే చేతులు మిన్న* అనే మథర్ తెరెసా గారి మాటలను ఆదర్శంగా తీసుకొని ఈ హెల్పింగ్ హార్ట్స్ అనేది స్టార్ట్ చేసాం. 2004 హెల్పింగ్ హార్ట్స్ ని అందరూ కలిసి విజయవంతం చేస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.

అయితే వీరు మొదటి సాయంగా మక్కినవారిగూడానికి చెందిన చక్రవర్తి అనే వ్యక్తికి ఆక్సిడెంట్ అవ్వగా, ఆయనకు 20 వేల రూపాయలు సాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. వీరి ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని నిన్ననేడు కోరుకుంటుంది.

2004 Helping Hearts Donates 20 Thousand2004 Helping Hearts Donates 20 Thousand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *