వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లుకు నగదు బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి – జెట్టి గురునాథ్ రావు

Jetti Gurunadha Rao with West godavari district collector

రైతుల పంపుసెట్లకు, విద్యుత్ మీటర్లు, నగదు బదిలీ పథకం పై కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ,నిరసన
ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉదయం 11 గంటలకు రాష్ట్రంలో ఉన్న రైతుల కొరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు నిర్ణయాన్ని, మరియ వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు కు నగదు బదిలీ పథకం నిర్ణయాన్ని రాష్ట్ర లో ఉన్న జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన తెలియజేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి యు రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాధరావు గారు నాయకత్వంలో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జెట్టి గురునాధరావు గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ నేడున్న జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రైతులను రైతాంగాన్ని మోసం చేస్తూ ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతులకు 12,500 రూపాయలు పెట్టుబడిగా ఇస్తానని 7500 రూపాయలు ఇస్తు మోసం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్తు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వచ్చిన హామీని, జగన్ ప్రభుత్వం నేడు నగదు బదిలీ పేరుతో రైతులను మోసం చేస్తు రైతులను ఆందోళనకు గురిచేస్తుంది . ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని విద్యుత్ మీటర్లు విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్ మోహన్ రావు జిల్లా ప్రధానకార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి సుబ్బారావు పిసిసి కార్యదర్శి మారుమూల థామస్ పీసీసీ కార్యదర్శి మద్దాల ప్రసాద్ పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ పైడి ముక్కల మురళీకృష్ణ సొసైటీ అధ్యక్షులు వేగవరం నల్ల కానీ నాగబాబు ఏలూరు కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ మొగిలి సతీష్ ,రొక్కం ఆదినారాయణ వీరవల్లి సోమేశ్వర రావు నాగేశ్వరరావు మొగలి శ్యామ్, మూర్తి, రామ సూరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

One thought on “వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లుకు నగదు బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి – జెట్టి గురునాథ్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *