మహేంద్ర సింగ్ ధోని 1800 జిఎస్టీ కట్టలేదట

MS Dhoni did not pay GST of 1800

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వివాదాలకి చాలా దూరం. మైదానంలోనే కాదు వెలుపల కూడా తనని కవ్వించినా లేదా విమర్శలు గుప్పించిన.. ధోనీ మాత్రం నోరుజారడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మూడేళ్ల వ్యవధిలోనే ధోనీ చేతికి టీమ్ పగ్గాలు రావడానికి ఈ వివాదరహిత గుర్తింపే ప్రధాన కారణం.

ఝార్ఖండ్ నుంచి భారత్ జట్టుకి ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ధోనీకి గత ఏడాది ఝార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోషియేషన్ (జేఎస్‌సీఏ) లైఫ్ టైమ్ మెంబర్‌షిప్‌ని ఇచ్చింది. దాంతో.. ఆ మెంబర్‌షిప్ ఫీజు రూ.10,000 కోసం ధోనీ ఇంటికి వెళ్లిన జేఎస్‌సీఏ అధికారి.. గత ఏడాదే మాజీ కెప్టెన్ నుంచి చెక్ తెచ్చుకున్నాడు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ.. ఇటీవల జేఎస్‌సీఏ విడుదల చేసిన వార్షిక రిపోర్ట్‌లో ధోనీ రూ.1800 బాకాయిలు పడినట్లు చూపించారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త శేష్ నాథ్.. జేఎస్‌సీఏపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. దాంతో.. రూ. వందల కోట్లు సంపాదించిన ధోనీ కేవలం రూ.1800 చెల్లించలేకపోవడమేంటి..? అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ధోనీ బకాయిలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో.. జేఎస్‌సీఏ అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మెంబర్‌‌షిప్ ఫీజు కింద రూ.10,000 చెక్ ఇచ్చిన ధోనీ.. దానికి జీఎస్టీ రూ.1800 చెల్లించలేదని జేఎస్‌సీఏ అధికారి ఒకరు తెలిపారు. ధోనీ నుంచి చెక్ తీసుకున్న అధికారి కూడా జీఎస్టీ విషయాన్ని అతనికి చెప్పకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని అతను చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు ప్రస్తుతం యూఏఈకి ధోనీ వెళ్లగా.. రూ.1800 బాకాయిపై అతనికి అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు సదురు అధికారి స్పష్టం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *