రియా చక్రాబోర్తి అరెస్ట్, బాలీవుడ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Rhea Chakraborthy Arrested in Drugs and SSR case

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయన ప్రేయసి, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఇప్పుడు మరో కేసులో ఇరుక్కున్నారు. సుశాంత్‌కు రియా చక్రవర్తి డ్రగ్స్ సరఫరా చేశారనే ఆరోపణతో ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మంగళవారం ఆమెని అరెస్ట్ చేసింది. అయితే ఆమెను పూర్తిస్థాయిలో విచారించేందుకు తమ కస్టడీలోకి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు తీసుకోవడంలేదు. ఆన్‌లైన్ కోర్టు ద్వారా రియాను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. మరి ఆమెకు కోర్టు బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోవడానికి కొన్ని నెలల ముందు నుంచీ రియా చక్రవర్తి ఆయనకు బాగా దగ్గరగా మెలిగారు. ఈ సమయంలో సుశాంత్‌కు తాను డ్రగ్స్ సరఫరా చేసినట్టు యాంటీ డ్రగ్ ఏజెన్సీ ముందు రియా అంగీకరించినట్టు సమాచారం. రియాను అరెస్టు చేసిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రియాను తొలిసారి ఆదివారం అధికారులు ప్రశ్నించారు. సుధీర్ఘ విచారణ అనంతరం మంగళవారం అరెస్టు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో భాగంగా సీబీఐ ఇప్పటికే రియా చక్రవర్తిని తమ ఛార్జిషీటులో నిందితురాలిగా చేర్చింది. అయితే, ఆ కేసు విచారణ జరుగుతున్నప్పుడు పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రియా.. తాను డ్రగ్స్ వాడలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు అవే ఆరోపణలో ఆమెను యాంటీ-డ్రగ్ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.

రియా చక్రవర్తి ఫోన్‌లో వాట్సాప్ చాట్స్ ద్వారా ఆమె డ్రగ్స్ వాడారని, సుశాంత్‌కు కూడా సరఫరా చేశారని పోలీసులు తెలుసుకున్నారు. ఈ చాట్ ఆధారంగానే ఆమెను ప్రశ్నించి అరెస్టు చేశారు. అయితే, నిన్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో రియా ఎమోషనల్ అయ్యారని.. తాను ఏం చేసినా అది సుశాంత్ కోసమే అని చెప్పారని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *