తెలంగాణ రెవిన్యూ శాఖలో ప్రక్షాళన కొనసాగుతుంది

Telangana Government on Revenue Department

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెవెన్యూ శాకలో భారీ ప్రక్షాళణలు చేపట్టింది. వీఆర్వో వ్యవస్థను సైతం రద్దు చేసింది. రెవెన్యూ శాఖలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఓ ఎమ్మార్వోను సస్పెండ్ చేశారు అధికారులు. తహసీల్దార్‌తో పాటు కొందరు రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్ వేటు వేశారు.

‌ సస్పెండ్‌ చేయడంతో ములుగు జిల్లా వెంకటాపూర్‌లోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్‌ కిషోర్‌కుమార్‌.. సర్పంచ్‌ సహా పలువురి పేరిట ప్రభుత్వ భూములకు పట్టా పాస్‌పుస్తకాలు జారీ చేశారనే ఆరోపణలు రావడంతో కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో తహశీల్దార్‌తో పాటు మరో ఐదుగురు రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్‌ వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారులుపై చర్యలు తీసుకున్న కలెక్టర్, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *