సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు మహేష్ బాబు

Mahesh Babu Started shooting after a long gap

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని సినీ పరిశ్రమ మొత్తం కొద్ది నెలలుగా మూతపడిన సంగతి తెలిసిందే. చిన్ని సినిమాలతో పాటు భారీ ప్రాజెక్టులు సైతం మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకున్నారు. అయితే అన్‌‌లాక్ ప్రక్రియలో భాగంతో కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తుండటంతో సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల షూటింగులు కూడా తిరిగి ప్రారంభమై మళ్లీ సందడి నెలకొంది. ఈ క్రమంలోనే పెద్ద సార్లు కూడా షూటింగులకు హాజరవుతున్నారు. కింగ్ నాగార్జున ఇటీవలే బిగ్‌బాస్-4తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సైతం ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. ’సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతి హిట్ సొంతం చేసుకున్న మహేశ్ కొద్దినెలలు విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. దీంతో మే నెల వరకు ఎలాంటి షూటింగ్స్ పెట్టుకోలేదు. పరశురామ్‌తో తీయబోయే ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కూడా తర్వాతే అని చెప్పేశాడు. ఈలోగా లాక్‌డౌన్ ఏర్పడటంతో ఆయనకు మరింత రెస్ట్ దొరికింది. ఈ సమయంలో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.

తాజాగా మహేశ్‌బాబు ఓ షూటింగ్ నిమిత్తం మేకప్ వేసుకున్నారు. అయితే ఇది సినిమా షూటింగ్ కాదు. అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న మహేష్ ఓ యాడ్ నిమిత్తం షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగే ఈ వాణిజ్య ప్రకటనకు సంబంధించి మహేశ్‌బాబు పాల్గొన్న ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. రెండుమూడు రోజుల పాటు జరిగే ఈ షూటింగ్‌లో కోవిడ్ నిబంధలన్నీ కచ్చితంగా పాటిస్తున్నారు. సిబ్బంది అందరూ పీపీఈ కిట్లు ధరించడంతో పాటు ఆ ప్రాంతాన్ని మొత్తం శానిటైజేషన్ చేసినట్లు సమాచారం. మరోవైపు సినిమా షూటింగ్‌లో మాత్రం సూపర్‌స్టార్ ఎప్పుడు పాల్గొంటారన్నది సస్పెన్స్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *