వైసీపీ , టిఆర్ఎస్ సొంత ప్రయోజనాలకోసం ఒక్కటి అయ్యారా – నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి.

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆంద్రలో ప్రజలను రాక్షసులతో పోల్చడం సిగ్గు చేటు, వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, రాబోయే ఉపఎన్నికల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన చర్య. తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్ట్స్ పైన మెతక వైఖరి అవసరం లేదు , అవసరం ఐతే అన్ని పార్టీలు మీకు మద్దతు ఇస్తాయి. రాయలసీమ కు సంబంధించిన ఎత్తిపోతల పథకం పైన తెలంగాణ ప్రభుత్వం కావాలని దుష్ప్రచారం చేస్తోంది.తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను కడుతోంది, పాలమూరు , దిండి ప్రాజెక్టులకు సంభందించి ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళాలి, తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ప్రాజెక్టు , 11 షెడ్యూల్ లో ఉన్నప్పటికీ కోర్టును ఆశ్రయించింది,11 వ షెడ్యూల్లో లేని పాలమూరు, దిండి ప్రాజెక్టులపైన ఆంధ్ర ప్రభుత్వం ఎందుకు కోర్టుకు వెళ్లడంలేదు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గోదావరి జలాలను పంచుకుందామని అట్టహాసంగా చర్చలు జరిపారు. మరి ఆ చర్యలు ఏమయ్యాయి నేడు. కెసిఆర్ గారు గోదావరి జలాల పైన స్పందించిన విధంగా కృష్ణా జలాలపై మీరు ఎందుకు స్పందించుటలేదు. కృష్ణా జలాల పంపకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎవరు ఎన్ని టీఎంసీలు పంచుకోవాలి చట్టబధంగా వివరంగా ఉంది.మరి దీనిపై వివాదం ఎందుకు.

 

పోతిరెడ్డిపాడు పై అక్రమంగా కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్లినప్పుడే ఆంధ్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఉంటే , నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు, మీ సొంత వ్యాపార ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజల నీటి హక్కుల గురించి మీరు మాట్లాడం లేదు. ఈ వ్యవహారం మీ ఇద్దరి మధ్య కాదు, కోట్లమంది ఆంధ్ర ప్రజల మధ్య ఉన్న వివాదం, వైసీపీ , టిఆర్ఎస్ లు ఇద్దరు మీ సొంత ప్రయోజనాలకోసం ఒక్కటై, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం సిగ్గుచేటు, రాయలసీమలో ఉన్న 52 మంది ఎమ్మెల్యేలలో 49 మంది మీ పార్టీకి సంబంధించిన వారే ఎమ్మెల్యేలు, రాయలసీమ ప్రయోజనాల కోసం ఈ 49 మంది ఎమ్మెల్యే లు, ఎంపీ లు ఎందుకు నోరు మెదపడం.

 

నేడు రాయలసీమలో సాగునీరు కాదు కదా త్రాగు నీరు కూడా లేని పరిస్థితి, వెంటనే మీరు రైతులతో, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు, తెలంగాణ చేస్తున్నా అక్రమ ప్రాజెక్టులపైన మీరు కేంద్ర జలవనరుల శాఖకు ఎందుకు ఫిర్యాదు చేయడంలేదు, మీ ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని నేడు ప్రజలు భావిస్తున్నారు, తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ని ఏర్పాటు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *