మీడియా సంస్థ‌లు, జ‌ర్న‌లిస్టుల‌పై పరువు నష్టం దావా వేసిన హీరోయిన్ శిల్పాశెట్టి

బాలీవుడ్  నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో విచార‌ణ ఎదుర్కొంటోన్న విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో శిల్పా శెట్టి పాత్ర కూడా వుందంటూ మీడియాలో అనేక ర‌కాల క‌థ‌నాలు వ‌స్తుండ‌డంతో ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.త‌న భ‌ర్త‌పై కేసు న‌మోదైతే త‌న ఫొటోలు, వీడియోలను కూడా మీడియా వాడుతుండ‌డం ప‌ట్ల అభ్యంత‌రాలు తెలిపింది. అంతేకాదు, ఆయా మీడియా సంస్థలపై ఆమె బాంబే హైకోర్టులో పరువునష్టం దావా వేసింది. త‌న‌ పరువు ప్రతిష్ఠ‌లకు భంగం కలిగించేలా కథనాలను రాశాయ‌ని ఆరోపించింది.ప‌లు జాతీయ మీడియా సంస్థలు, పలువురు జర్నలిస్టులపై ఆమె వేసిన‌ పరువునష్టం దావా ఈ రోజు విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. కాగా, కొన్ని రోజుల క్రితం అరెస్ట‌యిన‌ శిల్పా శెట్టి భ‌ర్త ప్ర‌స్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ స‌మ‌యంలో శిల్పా శెట్టిపై జాతీయ‌ మీడియాలో అనేక ర‌కాల‌ క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *