మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు.. సెలబ్రిటీలను విచారించనున్న ఈడీ

నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు  మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  ఈడీ మళ్లీ డ్రగ్స్ కేసులో ఉన్నవారిని విచారించనుంది. ఇందులో భాగంగా పురీ జగన్నాథ్ , రానా దగ్గుబాటి , హీరో రవితేజ , రకుల్ ప్రీత్ సింగ్ , తరుణ్‌, తనీష్‌, నందు, ముమైత్‌ ఖాన్‌ , చార్మీ కౌర్‌ , నవ్‌దీప్ తో పాటు హీరో రవితేజ డ్రైవర్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌… మొత్తం 12 మందికి  బుధవారం ఎక్సైజ్‌ శాఖనోటిసులు పంపింది.

విచారణ తేదీలు మరియు ప్రముఖులు: 
Aug  31:    పూరీ జగన్నాథ్‌
Sept 2  :    చార్మీ కౌర్‌
Sept 6  :    రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
Sept 8  :    రాణా దగ్గుబాటి
Sept 9  :    రవితేజతోపాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌
Sept 13:    నవ్‌దీప్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌
Sept 15:    ముమైత్‌ ఖాన్‌
Sept 17:    తనీష్‌
Sept 20:    నందు
Sept 22:    తరుణ్‌, తనీష్‌, నందు 

వీరిని ఈ నెల 31 నుండి ప్టెంబర్‌ 22 వరకు ఈడీ విచారించనుంది. అయితే ఇందులో రకుల్‌, రానా, రవిజేత పూరీని నిందితులుగా చేర్చలేదని మాదకద్రవ్యాల క్రయవిక్రయాలకు సంబందించిన  మనీలాండరింగ్‌లో వీరి ప్రమేయం ఉందని చెప్పడం తొందరపాటే అవుతుందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. నేరానికి చెందిన ఆధారాలు లభించే వరకు అందరిని సాక్షులుగా పరిగణిస్తామని వెల్లడించారు. ఈ కేసును  తెలంగాణ క్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలోని సిట్‌ దర్యాప్తు చేస్తోంది. కోర్టులో చార్జ్ షీట్ కూడా దాఖలు చేసినప్పటికీ ఈడీ రంగంలోకి దిగటం చర్చనీయాంశంగా మారింది.

2017లో టాలీవుడ్ సంచలనం రేపిన డ్రగ్స్ కేసు…
హైదరాబద్ జులై 2 2017 లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ మరియు అబ్దుల్‌ వహీద్, ఖుద్దూస్‌లను క్సైజ్‌ అధికారులు అరెస్ట్ చేసారు. రూ.30 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనంతో పాటు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు విద్యార్థులు, సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ విక్రయించినట్లు అనుమానించారు. విచారణలో ప్రముఖుల సినీ నటుల పేర్లు వెల్లడించటం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు కోసం ప్రత్యేక బృందం సిట్‌  ఏర్పడి, ఈ కేసులో 12 కేసులను నమోదు చేసి, 11 చార్జీషీట్లను కోర్టులో దర్యాప్తు అధికారులు దాఖలు చేసింది. మాదక ద్రవ్యాలు తీసుకునే వారి జుట్టు, గోళ్ల లో డ్రగ్స్ నమునాలు చాలా కాలం పాటు ఉంటాయని భావించి టాలీవుడ్‌ ప్రముఖులతో సహా మొత్తం 62 మంది దగ్గరి నుండి నమూనాలను సేకరించి పరీక్షలు జరిపింది. కానీ ఇప్పటి వరకు ఈ వైద్య పరీక్షల ఫలితాలను బయటకి వెల్లడించక పోవటం గమనార్హం. అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. అప్పట్లో సిట్ విచారణకు హాజరైన ప్రముఖులను మళ్లి విచారించాలని నిర్ణయించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *