ఢిల్లీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్

లాక్‌డౌన్ సమయంలో చేసిన ఎంతో మందికి ఆపద్భాంధవుడిలా మారిన నటుడు సోనుసూద్ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయంలోనే కాక ఇప్పటికీ కూడా తన సేవా కార్యక్రమాలను సోనూసూద్ కొనసాగిస్తున్నారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు ఇవ్వడం, అనారోగ్యం బారిన పడిన వారికి ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సోనూసూద్ సమావేశం కావడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Sonu Sood: My wife is Telugu and I feel like I belong here | Telugu Movie  News - Times of India

ఈ అంశంపై సోనూసూద్ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం దేశ్ కే మెంటర్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా తాను ఎంపికైనట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయబోతున్నట్లు ప్రకటించారు. దానికోసమే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం అయ్యారని కానీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలో మంత్రి కేటీఆర్‌తోనూ సోనూసూద్ భేటీ అయిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *