‘ఖిలాడి’ స్పీడు మామూలుగా లేదే!

రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ ఇది. ఆయన సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి అలరించనున్నారు.తాజాగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. త్వరలోనే మిగతా పనులను పూర్తి చేసి, విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు సింగిల్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడీగా మార్కులు కొట్టేసింది.అర్జున్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, సచిన్ కేడ్కర్ .. ముఖేశ్ రుషి .. ఉన్నిముకుందన్ .. రావు రమేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఆ తరువాత సినిమాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్న రవితేజ, నక్కిన త్రినాథరావు ప్రాజెక్టును కూడా పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *